హైదరాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
- June 21, 2021_1624260599.jpg)
హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్యాసింజర్ టెర్మినల్ భవనంలోని ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 80 మందికి పైగా ప్రయాణికులు, విమానాశ్రయ ఉద్యోగులు మరియు సిఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. సుమారు గంట పాటు యోగా సెషన్ కొనసాగింది. హార్ట్ఫుల్ నెస్కు చెందిన యోగా శిక్షకురాలు నీలిమ పర్యవేక్షణలో దీనిని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యోగా యొక్క ప్రయోజనాలను వివరించి, కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రాణాయం, సూక్ష్మ వ్యాయామ వంటి వివిధ ఆసనాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో విమానాశ్రయ సిబ్బంది, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమాన్ని సరైన భౌతిక దూరంతో నిర్వహించారు.
కోవిడ్ -19 మహమ్మారి ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ఒత్తిడిని తెచ్చింది. ఇలాంటి సమయంలో యోగా సాధన వల్ల రోగనిరోధక శక్తి, పాజిటివిటీ పెరిగి, ఒత్తిడి తగ్గుతుంది. నేడు ప్రపంచమంతటా శారీరక, మానసిక దృఢత్వం కోసం యోగాను అనుసరిస్తున్నారు.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం క్రమం తప్పకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే గత సంవత్సరం కోవిడ్ మహమ్మారి కారణంగా దానిని రద్దు చేసారు.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తమ ఉద్యోగులు వివిధ యోగా కోర్సులకు హాజరయ్యేలా ప్రోత్సహిస్తుంది, వారి కోసం ఆన్లైన్ సెషన్లు నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!