దైనందిన జీవితంలో భాగంగా యోగా: ఏపీ గవర్నర్
- June 21, 2021
అమరావతి: అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం రాష్ట్ర ప్రజలకు యోగా దినోత్సవ సందేశాన్ని అందించిన గవర్నర్, కరోనా నేపథ్యంలో భారతీయ సంప్రదాయ జీవన విధానమైన యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరముందని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు కోవిడ్ -19 కష్టకాలంలో యోగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వైరస్ నుండి రక్షణ కవచాన్ని అందిస్తుందన్నారు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు యోగాభ్యాసం ఉత్తమమైన మార్గంమని గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ వివరించారు.ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!