స్పెషల్ స్టోరీ:యోగా ప్రాముఖ్యతను వివరించిన యోగాచార్యులు

- June 21, 2021 , by Maagulf
స్పెషల్ స్టోరీ:యోగా ప్రాముఖ్యతను వివరించిన యోగాచార్యులు

ప్రాచీన భారతీయ సంప్రదాయం నుండి వచ్చిన ఒక అమూల్యమైన కానుక యోగా. మనః శరీరములు ఆలోచన-చర్యలు-లక్ష్యాలు-జీవిత ఫలాలు,మనిషి ప్రకృతిలో మమేకం కావడం పరిపూర్ణ ఆరోగ్యానికి మంచి భవనాలు కలిగించేది యోగా. యోగా ఒక వ్యాయామము కాదు, ప్రకృతిలోను, ప్రపంచంలోను ఏకత్వము తెచ్చు జీవన విధానాలు-జీవన శైలిని మార్చి, చేతనశక్తిని పెంచును. వాతావరణ మార్పులకు అనుగుణంగా దేహ ప్రకృతుని మార్చును.

ప్రపంచములో అన్ని ప్రాంతాలలో యోగా ప్రాచుర్యము పొందుచున్నది.అవిశ్రాంత మనస్సుకు యోగా ఓదార్పునిచ్చును. వ్యాధిగ్రస్తులకు ఇది ఒక వరము లాంటిది. సాధారణ మానవుడు కూడా నేడు కాలానికి తగినట్టుగా అందముగా నుండుటకు తగినట్టు దేహసౌష్ఠవమును పొందుటకు యోగాని అవలంబించుచున్నాడు. జ్ఞాపకశక్తిని పెంపొందింపచేసికొనుటకు బుద్ధి వికాసమునకు,సృజనాత్మకత శక్తీ పెంపొందించుటకు అనేక రకాలుగా యోగా ఉపయోగపడుతున్నది. బహుళార్ధ సాధకమైన ప్రయోజనాలను కలిగియున్నందువలన నేడు పాఠశాలలో, పాఠ్య ప్రణాళికలో కూడా యోగా ఒక అంతర్బాగముగా అభివృద్ధి చెందుచున్నది.

యోగ విద్యలో నిష్టాతులైనవారు సంపూర్ణమైన ఆత్మ వివేకాన్ని,అంతర్ముఖ ప్రజ్ఞను అలవరచుకొనుటకు చైతన్యం లోపలి పొరలు విచుకొనుటకు యోగా ఉపకరిస్తుంది.

ఆరోగ్యం మహాభాగ్యం అనే విషయం అందరికి తెలిసిన విషయమే ఈనాడు వైజ్ఞానికంగా ప్రపంచం ఎంతో అభివృద్ధి సాధించింది. వైద్యరంగంలో కూడా క్రొత్త క్రొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి మరొక ప్రక్కన రకరకాల వ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి.ఆస్పత్రుల సంఖ్య - డాక్టర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది కానీ ప్రజల ఆరోగ్యపరమైన అవసరాలు తీరడం లేదు. ధనం కూడా విపరీతంగా ఖర్చు అవుతున్నది. మాత్రలు వల్ల ఇంజక్షనుల వల్ల వ్యాధులకు తాత్కాలికంగా ఉపశమనమే గాని శాశ్వతంగా పరిష్కారం కావడం లేదనే భావం కూడా నానాటికి పెరిగిపోతుంది.

మరో వైపు అసలు రోగాలు రాకుండా జాగ్రత్త పడడం మంచిది కదా అని ఆలోచించే వారి సంఖ్య పెరిగింది. మందులు వాడనవసరం లేని ప్రేకృతి చికిత్స యోగా వంటి వాటిని పరిశీలించడం ప్రారంభించారు. పంచభూతాల్ని సక్రమంగా వినియోగించుకుంటే ఆ తత్వాలతో నిర్మాణమైన శరీరం యొక్క ఆరోగ్య రక్షణ తేలికగా జరుగుతుందని విశ్వాసం ప్రజలు కలుగుతున్నది. తత్ఫలితంగా మన భారతదేశంలో పాటు పాశ్చత్య  దేశాలలో యోగా విద్య పట్ల ఆకర్షణ రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నది.

ఈనాడు ప్రపంచ దేశాలలో ఎక్కడచూసినా దౌర్జన్యాలు-అవినీతి-ఉద్రిక్తలు పెరిగిపోతున్నాయి. మనదేశంలో కూడా ఇవి విచ్చలవిడిగా రాజ్యం చేస్తున్నాయి. వీటిని అరికట్టటానికి కేవలం ప్రభుత్వ చట్టాలు మాత్రమే సరిపోవు. ప్రజల స్వభావంలో కూడా సాత్విక మార్పులు రావాలి. దేశ భావి భారత పౌరులుగా రూపుదిద్దుకుంటున్న విద్యార్థినీ విద్యార్థుల విషయమై శ్రద్ధ వహించడం అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం పాఠశాలలో,కళాశాలలో చదువుకుంటున్న బాలబాలికలకు,యువతీయువకులకు యోగా అభ్యాస శిక్షణ ఎంతైనా అవసరం. శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వటంతో పాటు మానసికమైన ఆరోగ్యంగా ఎంతగానో ప్రభావము చూపే యోగవిద్యను అందరూ అభ్యసించి నిత్య సాధన చేయాలి.

ఈ ఆధునిక జీవనవిధానంలో మనిషికి సంక్రమిస్తున్న అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను పరిష్కారం చూపుతో చక్కటి జీవన విధానాన్ని అందిస్తున్న ఈ యోగ విద్యను,అన్ని తరగతుల మానవులు,కుల,మత,లింగ వయో భేదములు లేకుండా అందరికీ అందించాలని దృఢ సంకల్పంతో ఈ పుస్తక రచన చేయడం జరిగింది మరియు మరింత మందికి యోగా చేరువ చెయ్యాలని యోగాపై అవగాహన కలిగించే లక్ష్యంతో ఎందరికో తమ యోగా జ్ఞానాన్ని పంచుతున్నారు యోగా గురు 'యోగాచార్య సాంబశివ రావు'. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com