బోర్డింగ్ పాసులతో హెల్త్ యాప్ అనుసంధానం: సౌదీ ఏవియేషన్ అథారిటీ
- June 21, 2021
రియాద్: జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ), డొమెస్టిక్ విమానాలకు సంబంధించి బోర్డింగ్ పాసుల జారీ ప్రక్రియను తవకల్నా యాప్ ద్వారా ‘హెల్త్ స్టేటస్’కి లింక్ చేసే ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించింది. యాప్ ద్వారా ‘ఇమ్యూన్’ లేదా ‘ఇమ్యూన్ బై ఫస్ట్ డోస్’ లేదా ‘ఇమ్యూన్ బై రికవరీ’ లేదా, ‘నో రికార్డ్ ఆఫ్ ఇన్ఫెక్షన్’ అనే స్టేటస్ వున్నవారికి బోర్డింగ్ పాసుల్ని మంజూరు చేస్తారు. ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ, సౌదీ డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ, హెల్త్ మినిస్ట్రీ అలాగే నేషనల్ ఎయిర్ లైన్స్ సంయుక్తంగా ఈ ప్రక్రియ పూర్తి చేశాయి. గత ఏడాది తవక్కల్నా యాప్ గత ఏడాది ప్రారంభించారు కరోనా నేపథ్యంలో. కాగా, విదేశీ ప్రయాణీకులు సౌదీ అరేబియా రావాలనుకుంటే, కోవిడ్ 19 ఇమ్యునైజేషన్ డేటాను వారు బయల్దేరే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. ఇది గల్ఫ్ దేశాలకు చెందిన ప్రయాణీకులకూ వర్తిస్తుంది. కొత్త వీసాలు కలిగినవారికి, రెసిడెంట్స్ అలాగే వారి కంపానియన్స్ కోసం ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు