ఒమన్: పలు ప్రాంతాల్లో వర్షం

- June 22, 2021 , by Maagulf
ఒమన్: పలు ప్రాంతాల్లో వర్షం

మస్కట్: ఒమన్ దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తీర ప్రాంతాల్లోనూ దోఫార్ గవర్నరేట్ పరిధిలోని కొండ ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయి, గాలులు వీచాయి. ఈ మేరకు ఒమన్ మిటియరాలజీ ఓ ప్రకటన విడుదల చేసింది. క్యుములస్ మేఘాల ప్రభావం అల్ హజార్ కొండలపై ఎక్కువగా వుందని పేర్కొంది. హయిల్ తదితర ప్రాంతాల వైపు బలమైన గాలులు, మేఘాలు దూసుకొస్తున్నట్లు పేర్కొంది. తీర ప్రాంతాలు, కొండల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com