భార్యను హత్య చేసిన కేసులో నేపాల్ వ్యక్తికి జీవిత ఖైదు

- June 24, 2021 , by Maagulf
భార్యను హత్య చేసిన కేసులో నేపాల్ వ్యక్తికి జీవిత ఖైదు

దుబాయ్: భార్యను హత్య చేసిన కేసులో అరెస్టైన నేపాల్ వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ దుబాయ్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను కిరాతకంగా హత్య చేశాడు నేపాల్ వ్యక్తి. తల, మెడ, ఛాతి, పొత్తికడుపులో 11 సార్లు పొడిచాడు. దీంతో ఆమె రక్తపుమడుగులో అక్కడికక్కడే కుప్పకూలింది. చనిపోయిన భార్యను ఫోటో తీసిన తర్వాత హంతకుడు పోలీసులకు సమాచారం అందించాడు. 2020, సెప్టెంబర్ 25న ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసును న్యాయ విచారణకు బదిలీ చేశారు. విచారణ ముగియటంతో హంతకుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, శిక్షా కాలం తర్వాత దేశబహిష్కరణ విధిస్తూ తీర్పునిచ్చింది. యూఏఈ చట్టాల మేరకు 25 ఏళ్ల జైలు శిక్షే గరిష్ట కాలం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com