భారత్ కరోనా అప్డేట్
- June 24, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కేసులు 50 వేలకు దిగువున నమోదుకాగా, గత రెండు రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్ లో 54,069 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,82,778కి చేరింది.
ఇందులో 2,90,63,740 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,37,057 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1321 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 3,91,981కి చేరింది.ఇకపోతే ఒక్కరోజులో 68,885 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.భారత్ లో ఇప్పటి వరకు 30,16,26,028 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









