SOS, హజ్ సేవలతో తవక్కల్నా యాప్ అప్ డేట్

- June 24, 2021 , by Maagulf
SOS, హజ్ సేవలతో తవక్కల్నా యాప్ అప్ డేట్

సౌదీ: హజ్, ఉమ్రా ప్రార్థనల కోసం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తవక్కల్నా యాప్ ను అప్ డేట్ చేసినట్లు యాప్ నిర్వాహకులు తెలిపారు. మక్కాలోని పవిత్ర స్థలాల సందర్శన టికెట్ల కొనుగోలు, SOS సర్వీస్, ఫోన్ నెంబర్ లను అప్ డేట్ చేసేలా కొత్త ఫీచర్స్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ అప్ డేషన్ తో హజ్ యాత్రికుల ఇన్ట్సిట్యూషన్ క్వారంటైన్ కు కావాల్సిన సౌకర్యాలను కల్పించేందుకు దోహదపడుతుంది. అలాగే ఉమ్రా ప్రార్థనలు, హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే వారిని ఆమోదించటం, తిరస్కరించేందుకు యాప్ సేవలను వినియోగించనున్నారు. అంతేకాదు ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో అధికారులను వెంటనే సంప్రదించవచ్చు. అందుకు అనుగుణంగా SOS దోహదపడుతుంది. SOS సర్వీస్ ద్వారా సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీకి సమాచారం ఇవ్వొచ్చు.
అలాగే వారి ఎమర్జెన్సీ సేవల వినతికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సౌదీ పౌరులు, ప్రవాసీయులు, జీసీసీ పౌరులు, పర్యాటకులు తమ ఫోన్ నెంబర్ అప్ డేట్ చేయటం ద్వారా తవక్కల్నా యాప్ లో సైన్ ఇన్ అవ్వొచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com