అనారోగ్యానికి గురైన ప్రయాణీకుడ్ని ఎయిర్ లిఫ్ట్ చేసిన దుబాయ్ పోలీస్
- June 25, 2021
యూఏఈ: దుబాయ్ పోలీస్ ఎయిర్ వింగ్, దుబాయ్ కార్పొరేషన్ అంబులెన్స్ సర్వీసెస్ సహకారంతో, యూరోపియన్ వ్యక్తిని విమానాశ్రయం నుంచి ఆసుపత్రికి అత్యవసరంగా ఎయిర్ లిఫ్ట్ చేయడం జరిగింది. బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితి అనూహ్యంగా విషమించడంతో ఆమెను ఎయిర్ లిఫ్ట్ చేయవలసి వ్చింది. దుబాయ్ పోలీస్ ఎయిర్ వింగ్ ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ కల్నల్ అలి ముహమ్మద్ ఫరాజ్ అల్ ముహైరి వెల్లడించిన వివరాల ప్రకారం బాధిత మహిళ ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమెను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మరో దేశానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయట్నించారు. ఇంతలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని రద్దు చేశారు. అల్ మక్తౌమ్ విమానాశ్రయానికి తిరిగి ఆ విమానాన్ని తీసుకొచ్చారు. అక్కడే ఆ ఎయిర్ వింగ్ టీమ్ ఆమెను రిసీవ్ చేసుకుని, వెంటనే రషీద్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- వాట్సాప్‌లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్‌లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









