అవెన్యుస్ మాల్ కు పోటెత్తిన జనం..ఎంట్రీపై ఆంక్షలు విధించిన కువైట్

- June 26, 2021 , by Maagulf
అవెన్యుస్ మాల్ కు పోటెత్తిన జనం..ఎంట్రీపై ఆంక్షలు విధించిన కువైట్

కువైట్: ఓ వైపు డెల్టా వేరియంట్ తో ముప్పు ఉందని ప్రభుత్వం, వైద్య నిపుణులు చెబుతున్నా ప్రజలు తమ నిర్లక్ష్య ధోరణి వీడటం లేదు. కోవిడ్ కొత్త వేరియంట్లకు స్వాగతం పలుకుతున్నట్లుగా గుంపులు గుంపులుగా షాపింగ్ మాల్స్ కు ఎగబడుతున్నారు. ఆదివారం నుంచి వ్యాక్సిన్ పొందిన వారికే షాపింగ్ మాల్స్ లోకి ఎంట్రీ అవకాశం ఉండటంతో శుక్రవారం రోజున కువైట్ లోని ప్రముఖ షాపింగ్ మాల్స్ కు జనం ఎగబడిపోయారు. ఇక అవెన్యుస్ మాల్ జన సముద్రాన్నే తలపించింది. దీంతో అలర్టైన అధికారులు అవెన్యుస్ మాల్ ను మూసివేశారు. వ్యాక్సిన్ పొందిన వారిని మాత్రమే లోనికి అనుమతించాలని ఆదేశించారు. మై కువైట్ ఐడీ, ఇమ్యూన్ యాప్ ల ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నారా..లేదా అని ఎంట్రెన్స్ దగ్గర నిర్ధారించుకున్నాకే మాల్ లోకి అనుమతించనున్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఇదిలాఉంటే మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ 27 ఆదివారం నుంచి వ్యాక్సిన్ తీసుకోని వారికి పబ్లిక్ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ లోకి అనుమతి నిషేధం అమలులోకి రానుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com