తెలంగాణ కరోనా అప్డేట్

- June 27, 2021 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. గత కొన్నినెలల కాలంలో ఎన్నడూ లేనంతగా, వెయ్యికి లోపే రోజువారీ కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో 81,405 కరోనా పరీక్షలు నిర్వహించగా, 748 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,492 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 6,20,613 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,02,676 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,302 మంది చికిత్స పొందుతున్నారు.ఇప్పటిదాకా కరోనాతో మొత్తం 3,635 మంది మరణించారు.తెలంగాణలో కరోనా రికవరీ రేటు 97.10 శాతానికి పెరిగింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 121 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com