నాన్ వ్యాక్సినేటెడ్ వారిని అనుమతిస్తే KD5000 ఫైన్
- June 28, 2021
కువైట్: వ్యాక్సిన్ తీసుకోని వారిని అనుమతిస్తే మాల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే అనుమతించాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని మాల్స్, క్లబ్స్, రెస్టారెంట్లు, కేఫ్ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని మరోసారి గుర్తు చేశారు. ఎవరైనా మంత్రివర్గ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే KD 5000 వరకు ఫైన్ విధిస్తామన్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా 6000 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న మాల్స్ తో పాటు రెస్టారెంట్లు, కేఫ్ లలోకి వ్యాక్సిన్ తీసుకున్న వారికే అనుమతించాలన్న నిబంధన ఆదివారం నుంచే అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. మై కువైట్ ఐడీ, ఇమ్యూన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికెట్లను చెక్ చేసిన తర్వాతే కస్టమర్లను లోనికి అనుమతించాలని అధికారులు సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు మాల్స్ లోకి ఎంటరైతే సదరు వినియోగదారుడు మోసపూరితంగా లోనికి ప్రవేశించినట్లు మేనేజ్మెంట్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే..ఈ నిబంధన పండ్లు, కూరగాయల వంటి నిత్యావసరాల షాపులకు వర్తించదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







