విదేశీ వ్యవసాయ కార్మికుల భర్తీకి కోవిడ్ కమిటీ గ్రీన్ సిగ్నల్
- July 01, 2021
కువైట్: విదేశీ వ్యవసాయ కార్మికులను భర్తీకి కోవిడ్ ఎమర్జెన్సీ మినిస్ట్రియల్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విదేశాల నుంచి వ్యవసాయ కార్మికులు కువైట్ చేరుకునేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కోవిడ్ కారణంగా విదేశీయుల రాకపై పలు ఆంక్షలు ఉండటంతో వ్యవసాయ రంగంలో కార్మికుల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో కువైట్ రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. కార్మికుల కొరతతో వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని, విదేశీ కార్మికులను అనుమతించాలని కోరాయి. దీనికి స్పందించిన ప్రభుత్వం..కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూనే తగిన జాగ్రత్తలతో 'అల్ సలమా' యాప్ ద్వారా విదేశాల నుంచి వ్యవసాయ కార్మికుల భర్తీకి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన రైతు సంఘాలు..రైతుల భర్తీకి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపాయి.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..