కరోనా కట్టడిలో స్వచ్ఛంద సేవలు అభినందనీయం

- July 01, 2021 , by Maagulf
కరోనా కట్టడిలో స్వచ్ఛంద సేవలు అభినందనీయం

విజయవాడ: కరోనా కట్టడిలో స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వానికి అందిస్తున్న సహకారం అభినందనీయమని  ఉపముఖ్యమంత్రి, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. బుధవారం విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న గురుద్వారా శ్రీ గురుసింగ్ సభకు చెందిన సిక్కు  ప్రతినిధులు కోవిడ్ బాధితులకోసం ఆక్సీజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందచేసిన కార్యక్రమంలో మంత్రి ఆళ్ల నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ ఆధ్వర్యంలో సిక్కు ప్రతినిధులు కోవిడ్ బాధితులను ఆదుకోవటంతో పాటు సమాజానికి అనేక రూపాలలో సేవలందిస్తున్నారని ప్రశంసించారు. సామాజిక బాధ్యత గా ప్రతి ఒక్కరూ కోవిడ్ బాధితుల్ని ఆదుకోవాలని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు.  సిక్కు ప్రతినిధుల సేవానిరతిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి అందచేసిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లను అవసరమైన వారికి అందిస్తామన్నారు. దుబాయ్ కి చెందిన గురుద్వారా గురునానక్ దర్బార్, ఎస్ సురిందర్సింగ్ ఖందారీ 10 లీటర్ల సామర్థ్యం గల 12 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందచేశారని గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ అధ్యక్షుడు ఎస్ కన్వర్జిత్సింగ్ చెప్పారు. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని చేతులమీదుగా ప్రభుత్వానికి అందజేశామన్నారు.ఈ కార్యక్రమంలో గురుసింగ్ సభ కార్యరద్శి ఎస్.హర్ మొహిందర్ సింగ్, కమిటీ సభ్యులు హర్మీత్ సింగ్, జెజె సింగ్, గుర్జిత్ సింగ్, కన్వర్జోత్ సింగ్, గునీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com