బోసిపోయిన సోహర్ రహదారులు..రాత్రి వేళల్లో కనిపించని జనం
- July 01, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ పాక్షిక ఆంక్షలు విధించటంతో సోహర్ రహదారులు బోసిపోయాయి. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అత్యవసర వాహనాలకు మినహా ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని సుప్రీం కమిటీ ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీం కమిటీ సూచనలకు అనుగుణంగా జనం కూడా ఆంక్షల సమయంలో బయటకు రావటం లేదు. దీంతో సోహర్ విలయత్ లోని రోడ్లన్ని ఖాళీగా కనిపించాయి. ఇదిలా ఉంటే..కొద్ది రోజులుగా సోహర్ విలయత్ లో కోవిడ్ తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం కూడా 179 కొత్త కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. దీంతో విలయత్ పరిధిలో ఇప్పటి వరకు కోవిడ్ కేసుల సంఖ్య 20,031కి పెరిగింది. మృతుల సంఖ్య 215కి పెరిగింది.
తాజా వార్తలు
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..