నాన్ వ్యాక్సినేటెడ్ ఎంట్రీ బ్యాన్: 141 హెచ్చరికలు, 8 ఉల్లంఘనలు

- July 02, 2021 , by Maagulf
నాన్ వ్యాక్సినేటెడ్ ఎంట్రీ బ్యాన్: 141 హెచ్చరికలు, 8 ఉల్లంఘనలు

కువైట్: వ్యాక్సినేషన్ పొందనివారికి షాపింగ్ మాల్స్ అలాగే కమర్షియల్ కాంప్లెక్సుల్లోకి ప్రవేశం నుంచి నిషేధం విధించిన దరిమిలా, పరిస్థితిని సమీక్షించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపడుతున్నారు. హవాలీ మునిసిపాలిటీ నిర్వహించిన తనిఖీల్లో 8 ఉల్లంఘనలు గుర్తించడంతోపాటు, 141 హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. జూన్ 27 నుంచి ఈ తనిఖీల్ని ప్రారంభించారు. ప్రముఖ కమర్షియల్ కాంప్లెక్సులు, మార్కెట్లు, రెస్టారెంట్ సెంటర్లు, కేఫ్‌లు, హెల్త్ ఇని్టిట్యూట్స్, బార్బర్ షాపులు అలాగే బ్యూటీ సెలూన్లలో తనిఖీలు జరిగాయి. వివిధ గవర్నరేట్లలో తనిఖీలు జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com