ఏపీ కరోనా అప్డేట్
- July 02, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కిందికి దిగివస్తోంది.రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,759 సాంపిల్స్ ని పరీక్షిచంగా..3,464 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 35 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.చిత్తూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్క రు, కర్నూల్‌లో ఒక్కరు, పశ్చి మ గోదావరిలో ఒక్క రు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.ఇక, ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 4,284 మంది కోవిడ్ నుండి పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,96,818కి పెరగగా…రికవరీ కేసులు 18,46,716కు చేరింది.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 12,779కు పెరిగింది.ప్రస్తుతం యాక్టివ్ కేసులు 37,323గా ఉన్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







