భారత్-యూఏఈ మధ్య విమానాల రద్దు పొడిగింపు
- July 02, 2021
యూఏఈ: భారత్ నుంచి వచ్చే విమానాలపై ట్రావెల్ బ్యాన్ తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది యూఏఈ అధికారిక ఎయిర్లైన్స్ సంస్థ ఎమిరేట్స్. అంతేకాదు..గత 14 రోజుల్లో భారత్ కు వెళ్లిన వారికి...ఇతర ఏ దేశం మీదుగానైనా యూఏఈకి వచ్చేందుకు అనుమతి నిరాకరించబడుతుందని వెల్లడించింది. అయితే..యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యపరమైన పనుల మీద ప్రయాణం చేసేవారు, సవరించిన కోవిడ్ ప్రోటోకాల్ మేరకు ప్రయాణానికి అనుమతించిన వర్గాల వారికి మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం భారత్ నుంచి యూఏఈకి ప్రయాణాలపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







