ఆశాజనకంగా హైడ్రోజన్ కార్ల టెస్టింగ్..ఆరామ్కో వెల్లడి
- July 03, 2021
సౌదీ: కార్బన్ ఉద్గారాలను తగ్గించి వాతావరణానికి దోహదపడేలా హైడ్రోజన్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న అరామ్కో..తమ ప్రయత్నాలు
ఆశాజనకంగా కొనసాగుతున్నాయని వివరించింది. హైడ్రోజన్ కార్ల ప్రాజెక్టుపై గత రెండు సంవత్సరాలుగా టెస్టులను నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే..సౌదీ రోడ్లపై హైడ్రోజన్ కార్లు పరుగులు తీసేందుకు మరికొన్నేళ్లు పట్టొచ్చన్నారు. ప్రభుత్వ వర్గాల సహాకారంతో పర్యావరణహితంగా కార్లను రూపొందించేందుకు ఇప్పటికే తాము అనేక ప్రయోగాలు చేశామని, అయితే..హైడ్రోజన్ కార్లపై రెండేళ్లుగా ప్రయోగాలు చేస్తున్నామని అరామ్కో ప్రతినిధులు వివరించారు. సౌదీకి వాతావరణాకి అనుగుణంగా హైడ్రోజన్ కార్లు సూట్ అవుతాయని నిర్ధారిచుకున్నట్లు తెలిపారు. హైడ్రోజన్ కార్లు అందుబాటులోకి రావటం ద్వారా కింగ్డమ్ ఇంధన సమస్యలు కూడా ఉండవని, ఎందుకంటే ప్రపంచంలోనే హైడ్రోకార్బన్‌ల రూపంలో ఇంధనాన్ని ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశం సౌదీ అని వివరించారు. అందుకే హైడ్రోజన్ డిమాండ్‌ను సౌదీ తట్టుకోగలదన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..