NRIలకు భరోసాగా ప్రవాసి రిష్తా పోర్టల్

- July 06, 2021 , by Maagulf
NRIలకు భరోసాగా ప్రవాసి రిష్తా పోర్టల్

భారత ప్రవాసియులు ఆయా దేశాల రాయబార/దౌత్యకార్యాలయాలతో సమన్వయం చేసేందుకు భారత ప్రభుత్వం కొత్తగా ప్రవాసి రిష్తా పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవటం ద్వారా అత్యవసర సమయాల్లో సకాలంలో ఆయా దేశాల్లోని రాయబార/దౌత్యకార్యాయాలను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. అలాగే ఎంబసీ నుంచి ఎమర్జెన్సీ అలర్ట్స్, ఇతర ముఖ్య సందేశాలు, సూచనలు,ప్రవాసియుల కోసం భారత ప్రభుత్వ తీసుకుంటున్న విధాన నిర్ణయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రయోజనం పొందెలా ప్రవాసి రిష్తా పోర్టల్ ఉపకరించనుంది.అందుకే యూఏఈలోని ప్రతి భారతీయుడు ప్రవాసి రిష్తా పోర్టల్ లో https://pravasirishta.gov.in/home  లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని దుబాయ్ లోని దౌత్య కార్యాలయం పేర్కొంది.దుబాయ్ తో పాటు నార్తర్న్ ఎమిరేట్స్ లో ఉండేవాళ్లు http://https:/pravasirishta.gov.in లింక్ ద్వారా తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవచ్చు. కోవిడ్ నేపథ్యంలో విదేశాల్లోని భారతీయులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండేందుకు వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఈ పోర్టల్ ఉపయోగపడనుంది.పోర్టల్ లో తమ వివరాలను నమోదు చేయటం ద్వారా విదేశాల్లోని ప్రవాసీయుల సమాచారం మొత్తం రాయబార/దౌత్యకార్యాలయాలతో పాటు భారత ప్రభుత్వానికి అందుబాటులోకి రానుంది.దీంతో వారి సంక్షేమం కోసం భవిష్యత్తులో తగిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది.అంతేకాదు ఎవైనా ఇబ్బందులు తలెత్తినా, సమస్యలు ఎదురైనా రాయబార/దౌత్యకార్యాయాలతో కమ్యూనికేట్ చేసుకోవచ్చు.తద్వారా సకాలంలో సమస్యను పరిష్కరించుకునేందుకు ఆస్కారం ఉంటుంది.అందుకే యూఏఈలోని ప్రతి ఒక్క ప్రవాసి భారతీయుడు ప్రవాసి రిష్తా పోర్టల్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని దుబాయ్ దౌత్య కార్యాలయ అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com