సురభి కళాకారులకు గల్ఫ్ తెలుగు సంఘాల చేయూత

- July 08, 2021 , by Maagulf
సురభి కళాకారులకు గల్ఫ్ తెలుగు సంఘాల చేయూత

కరోనా మహమ్మారి ఎన్నో జీవితాల్ని చిదిమేసింది.మరెన్నో జీవితాలను,వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది.ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక కళాకారులు ఈ కరోనా సమయంలో ఆదరించే దిక్కులేక జీవనోపాధి కోల్పోయారు.తినడానికి తిండి కూడా లేని దైన్యస్థితి లో ఉన్నారు నాటక రంగాన్నే నమ్ముకున్న ఎంతోమంది కళాకారులు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కళాకారులకు,వారి కుటుంబాలకు అండగా నిలుస్తోంది గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య.గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలన్నీ ఒక త్రాటిపై నిలచి సురభి కళాకారులచే జూమ్ లింక్ ద్వారా నాటక ప్రదర్శనలు చేయిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించారు.దీనిలో భాగంగా తెలుగు కళా సమితి బహ్రెయిన్ ఆధ్వర్యంలో జులై 9వ తేదీన మాయా బజార్ మొదటి నాటకంగా ప్రదర్శించబడుతుంది.అంతర్జాల మాధ్యమంగా ఈ నాటకాన్ని బహ్రెయిన్ దేశంలోని తెలుగు వారితో పాటు దుబాయ్,కువైట్,ఖతార్, ఒమన్ మరియు సౌదీ అరేబియా దేశాల్లోని తెలుగు వారు ఒకే సారి చూడవచ్చు.జులై నెల ప్రదర్శన తరువాత వరుసగా తెలుగు కళా సమితి ఒమన్ (ఆగస్టు),తెలుగు కళా సమితి కువైట్ (సెప్టెంబర్),ఆంధ్ర కళా వేదిక ఖతార్ (అక్టోబర్),తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్ (నవంబర్) ఆధ్వర్యంలో సురభి కళాకారులతో వివిధ నాటకాలు ప్రదర్శించబడతాయి.తద్వారా నాటక రంగ సేవతో పాటు కష్టాలలో ఉన్న కళాకారులను ఆదుకోవడం జరుగుతుంది.ఈ వర్చ్యువల్ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com