విదేశీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ స్కృటినికి ప్రత్యేక బృందం
- July 08, 2021
కువైట్: విదేశాల నుంచి కువైట్ ప్రయాణించేవారు సమర్పించే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరిశీలించేందుకు కువైట్ ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి కువైట్ చేరుకునే వారు వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా నిర్ధారించుకునేందుకు సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది. విదేశాల్లో వ్యాక్సిన్ తీసుకొని ఫిజికల్ గా గానీ, కువైట్ వెబ్ సైట్లోగానీ అప్ లోడ్ చేయాలి. అయితే ప్రయాణికులు చూపించే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు సరైనవా, నకిలీవా అనేది ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం స్కృటిని చేస్తుంది. ఇదిలాఉంటే వివిధ దేశాల్లోని గుర్తింపు పొందిన పలు ల్యాబరేటరీల నుంచి తీసుకున్న పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను కువైట్ ఆమోదిస్తోందని మరోమారు స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న విదేశీ ప్రయాణికులు..కువైట్ చేరుకున్న మూడో రోజున మరోమారు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోని వారు ఆరో రోజు కూడా మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







