కార్మికులకు గొడుగు టోపీలను పంపిణీ చేసిన సదరన్ ఏరియా మునిసిపాలిటీ
- July 09, 2021
మనామా: సదరన్ ఏరియా మునిసిపాలిటీ, పని ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికులకు గొడుగు టోపీలను పంపిణీ చేసింది. స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తలకు తేలిగ్గా అమరిపోయేలా ఈ గొడుగు టోపీలను రూపొందించారు. ఎండ నుంచి కార్మికులకు ఈ గొడుగు టోపీలు రక్షణ ఇస్తాయి. వాటిని వారు పట్టుకోవాల్సిన పనిలేదు. ఎండ సమయాల్లో కార్మికులు ఎండ ప్రభావానికి గురి కాకుండా ఈ టోపీలు రక్షణ కల్పిస్తాయని అధికారులు తెలిపారు. స్వచ్ఛందంగా వీటిని అందించేందుకు ముందుకొచ్చిన ఆయా సంస్థల్ని మునిసిపాలిటీ అభినందించింది. జులై నుంచి ఆగస్ట్ చివరి వరకు మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేస్తూ సదరన్ మునిసిపాలిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ వేడిలో పని చేయడంపై బ్యాన్ కొనసాగుతోంది. ఈ నిబంధనను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







