ఖతార్ ఎయిర్వేస్ నుంచి 14 కొత్త డెస్టినేషన్స్
- March 09, 2016
ఖతార్ ఎయిర్వేస్ ప్రపంచ వ్యాప్తంగా మరో 14 డెస్టినేషన్లకు విమానాల్ని నడపనున్నట్లు ప్రకటించింది. అత్యంత సుదూరం ప్రయాణించే (దోహా మరియు ఆక్లాండ్ మధ్య) విమాన సర్వీసుతోపాటు పలు సర్వీసులు ఇందులో ఉంటాయి. ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్ బకర్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫెయిర్ ఐటిబి బెర్లిన్ ప్రారంభోత్సవంలో ఈ వివరాల్ని వెల్లడించారు. యూరోప్‌లోని పిసా (ఇటలీ), సరజెవో (బోస్నియా), హెల్సింకి (ఫిన్లాండ్), స్కప్ (మెసిడోనియా), నీస్ (ఫ్రాన్స్) వంటి ఐదు డెస్టినేషన్లకు కొత్తగా విమాన సర్వీసులు నడవనున్నాయి. ఆగస్ట్ 2న ప్రారంభమయ్యే దోహా నుంచి పిసా విమాన సర్వీసు నాన్ స్టాప్ (ఎ320 విమానం) కావడం గమనించదగ్గది. సెప్టెంబర్ 7న సరజెవోకి ప్రారంభమయ్యే విమానం వారంలో మూడు రోజులపాటు సేవలందిస్తుంది. దోహా - హెల్సింకి మధ్య నడిచే విమానాలు అక్టోబర్ 10 ప్రారంభమవుతాయి. ఇది డైలీ సర్వీస్. ఆఫ్రికాలోని ఆరు డెస్టినేషన్లకు విమానాలు నడుపనుంది ఖతార్ ఎయిర్వేస్. ఇందులో మొరాకో, నాంబియా, కామరోన్, గబాన్, జాంబియా ఉన్నాయి. ఆక్లాండ్, క్రాబి, చియాంగ్ మాయ్ తదితర డెస్టినేషన్లకూ విమానాలు నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







