యూఏఈలో విస్తరణకు సిద్ధంగా మరో మాల్‌

- March 09, 2016 , by Maagulf
యూఏఈలో విస్తరణకు సిద్ధంగా మరో మాల్‌

ఇన్వెస్ట్‌ మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కంపనీ అబుదాబీ లిస్టెడ్‌ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ - అల్దార్‌ ప్రాపర్టీస్‌ 318 మిలియన్‌ దిర్హామ్‌ల కాంట్రాక్ట్‌ని అల్‌ జిమి మాల్‌ రిఫర్‌బిష్‌మెంట్‌ మరియు విస్తరణ కోసం పివట్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి అప్పగించింది. అల్‌ జిమి మాల్‌ ముఖ్యమైన రిటైల్‌ అస్సెట్‌గా అల్‌ అనిన్‌లో పేరు తెచ్చుకుంది. సంవత్సరానికి 8 మిలియన్‌ విజిటర్లతో నిత్యం బిజీగా ఉంటుంది ఈ మాల్‌. వెస్ట్‌ సైడ్‌ ఎక్స్‌పాన్షన్‌ చేపట్టి, అదనంగా చాలా ఎక్కువ భాగం వాడకంలోకి తీసుకురానున్నారు. మూడు లెవల్స్‌లో 51 యూనిట్లను అందుబాటులోకి తెచ్చేలా విస్తరణకు రూపకల్పన చేశారు. అదనపు రిటైల్‌ స్పేస్‌తోపాటు, న్యూ డైనింగ్‌ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఔట్‌లెట్స్‌ని పెంచుతారు. అలాగే నార్త్‌ సైడ్‌ కూడా మాల్‌ని విస్తరించనున్నారు. అలాగే వెయ్యికి పైగా అదనపు కార్లకు పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తారు. 2018 నాటికి మాల్‌ విస్తరణ పనులు పూర్తవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com