లులు సంస్థ పేరుతో కస్టమర్లకు ఎర వేస్తున్న మోసగాళ్లు..
- July 14, 2021
యూఏఈ: మోసపూరిత ప్రచారంతో నకిలీ వెబ్‌సైట్‌కు బలైపోవద్దని యూఏఈ కి చెందిన రిటైలర్ లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ప్రజలను కోరారు.
నకిలీ వెబ్‌సైట్ యొక్క లింక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చక్కర్లు కొడుతోంది. వెబ్‌సైట్ 'లులు హైపర్‌మార్కెట్ 20 వ వార్షికోత్సవ వేడుక' ఆఫర్‌తో ప్రజలను ఆకర్షిస్తూ పలు ప్రశ్నలను కలిగి ఉంది. ఒక వ్యక్తి లులు గురించి ఎంత తెలుసు, బ్రాండ్ గురించి వారి అభిప్రాయాలు మరియు వారి వయస్సును నమోదు చేసిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన తర్వాత, చెక్ బాక్సులతో కొత్త పేజీ తెరుచుకుంటుంది. బహుమతితో సరైన ఆప్షన్ ను ఎంచుకోవడానికి మూడు ఛాన్సులు ఉన్నాయి - హువావే మేట్ 40 ప్రో. లేదా ఏదైనా బహుమతిని క్లెయిమ్ చేయడానికి, వ్యక్తి 20 మంది స్నేహితులకు లేదా ఐదు గ్రూపుల్లో వాట్సాప్‌లో పోటీని షేర్ చేయాలి.
ఈ ప్రచారం నకిలీ అని లులు గ్రూప్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వి. నందకుమార్ గుర్తించారు.
"ఇలాంటి మోసగాళ్ళు కొత్త కొత్త ఉపాయాలతో మరలా మరలా ఇబ్బంది పెట్టడం దురదృష్టకరం. ఈ విషయం గురించి మేము సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చాము. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్‌ల వలలో పడవద్దని మా విశ్వసనీయ కస్టమర్లను మేము కోరుతున్నాము. అలాగే, మా వినియోగదారులను వ్యక్తిగత వివరాలు బ్యాంక్ ఖాతా లేదా కార్డ్ నంబర్ వంటివి ఎప్పుడూ పంచుకోవద్దని మేము కోరుతున్నాము. ఏదైనా ఆఫర్లు ఉంటె మేము వాటిని అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫారం పై తెలియజేస్తాము” అని నందకుమార్ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







