హెల్తీ బ్రోకలీ
- July 16, 2021కావలసిన పదార్ధాలు: బ్రోకలీ 1, సెనగపిండి 2 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన ౩ పచ్చి మిరపకాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, కారం పావు స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ.
తయారు చేయు విధానం: ముందర బ్రోకలీ ని శుభ్రం గా కడిగి, చిన్న చిన్న గుత్తులు గా కొయ్యండి. తర్వాత ఒక గిన్నె లో 2 లీటర్లు నీరు ని మరిగించి, మరుగుతన్న నీటిలో బ్రోకలీ ని 3 నిమిషాలు ఉడికించండి. ఆ నీటిని పారబోసి బ్రోకలీ పైన ఫ్రిడ్జ్ లోని చల్లని నీరు పోసి వేడి తగ్గేంత వరకు ఉంచండి. స్టవ్ పైన బాణీ లో శనగపిండిని 2 నిమిషాలు కమ్మని వాసన వచ్చేంతవరకు డ్రై రోస్ట్ చెయ్యండి. అది తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీల కర్ర పొడి 2 నిమిషాలు కమ్మని వాసన వచ్చేంతవరకు డ్రై రోస్ట్ చెయ్యండి, అది కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాణీ లో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసి దాంట్లో తరిగిన పచ్చి మిరపకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి ఒక నిమిషం వేయించండి, తర్వాత బ్రోకలీ వేసి అర నిమిషం వేయించి అప్పుడు కారం, సెనగపిండి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి ఇంకొక అర నిమిషం వేయించాక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి గా రొట్టెల తో కానీ రైస్ తో కానీ తినచ్చు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు