ఈ ఏడాది గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం

- July 16, 2021 , by Maagulf
ఈ ఏడాది గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం

సౌదీ: సౌదీ ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతోంది. జూన్ మాసానికి సంబంధించి ద్రవ్యోల్బణ రేటు 6.2 శాతానికి చేరింది. ఈ ఏడాదికిగాను ఇదే అత్యధిక స్థాయి కావటం గమనార్హం. చమురు, అహార పదార్ధాల ధరల్లో పెరుగుదల చోటు చేసుకోవటమే ఇందుకు కారణమని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. స్టాటిస్టిక్స్ జనరల్ అథారిటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత మేలో సౌదీ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా నమోదైంది. ధరల పెరుగుదలకు వ్యాట్ కూడా ఓ కారణంగా మారింది. గతేడాది జులైకి ముందు వ్యాట్ 5 శాతం మాత్రమే ఉండేది. కానీ, జులైలో వ్యాట్ పర్సెంటేజ్ ను 5 శాతం నుంచి 15 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ఈ ఏడాది సౌదీ ద్రవ్యోల్బణంలో మరింత పెరుగుదల ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గరిష్టంగా 6.3 శాతానికి చేరొచ్చని చెబుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com