ఎంటర్‌ప్రెన్యూర్‌ల మానసిక ఆరోగ్యానికి చిట్కాలు
- July 16, 2021మహమ్మారి ఫస్ట్ వేవ్‌లో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. అయితే కనీసం 2021లోనైనా ప్రతి ఒక్కరూ బాగా పుంజుకోవాలని ఆశిస్తుండగా, కరోనా వైరస్ ఎంటర్‌ప్రెన్యూర్‌లతో యుద్ధానికి ప్లాన్ చేస్తున్నది.
వ్యాపారం అనేది ఒక వ్యవస్థాపకుడికి (ఎంటర్‌ప్రెన్యూర్) జీవనోపాధి మాత్రమే కాదు, అది ఒక గుర్తింపు కూడా. ఈ గుర్తింపును కోల్పోవడం వలన అది ఒత్తిడి మరియు నిరాశల బీజాలను నాటి వారి మనస్సులను బాగా ప్రభావితం చేస్తుంది. మాయా మంత్రదండంతో మీ సమస్యలు పరిష్కరించగల మార్గం అనేది లేదు, కానీ, మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మీ మనస్సు మరియు వ్యాపారాన్ని పూర్తి శక్తితో పున:ప్రారంభించడానికి సహాయపడుతుంది. ఇటువంటి పతనావస్థలో వెలుగు వైపు చూడడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు :
మీ వ్యాపార నమూనా గురించి పునరాలోచించండి
మీరు ఎల్లప్పుడూ సముద్రంలో భాగం కావాల్సిన అవసరం లేదు, దాని నుండి బయటపడడానికి మీ స్వంత మార్గాన్ని తయారు చేసుకోవాలి. కొన్నిసార్లు మీరు వంగాల్సి ఉంటుంది, ఒక అడుగు వెనక్కు తీసుకోవాలి, పున:పరిశీలించాలి, మీ దిశను మార్చుకోవాలి మరియు సముద్ర తరంగాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాపారాన్ని నడపడంలో ప్లాన్ బి కోసం కూడా చూడండి.
మనుగడపై దృష్టి పెట్టండి
‘‘కీర్తిని సాధించడానికి పెద్ద అడుగులు వేయడం’’ అనేది పాత రోజుల మాట. ప్రస్తుతం మీరు చిన్న అడుగులే వేయాలి. ఈ రోజుల్లో వ్యాపార యజమానుల ఇబ్బందుల జాబితాలో ఆర్థిక చింతలు అనేవి పై వరుసలో ఉంటున్నాయి. కాబట్టి, మీరు ఒక సంవత్సరం పాటు లగ్జరీని మరచిపోయి కేవలం అవసరాలపైనే దృష్టి పెట్టాలి. మీ ప్రయోజనాలను వదులుకోండి, కానీ మీ నాణ్యతను వదులుకోవద్దు.
మనస్సును కఠినం చేసుకోవడం కీలకం
వ్యాపారం అనేది కఠినమైన నిర్ణయాలపై నడుస్తుంది. గడిచే కొద్ది అది కఠినంగా ఉంటుంది, మీ ఉద్యోగులు నిష్క్రమించడానికి వారిని సంసిద్దం చేయండి. ఒకరిని ఇబ్బందుల్లోకి నెట్టడం అనేది మొదట కాస్త మొరటుగా అనిపించవచ్చు కానీ దీర్ఘకాలంలో మీరు మీ వ్యాపారాన్ని మూసివేయకుండా ఉంచడం ద్వారా ఇతర ఉద్యోగుల జీవనోపాధిని అది నిలుపుతుంది.
మీ ఉద్యోగులలో సవరణలు చేయండి
ఇప్పటికే ఉన్న ఆస్తుల ఉత్పాదకతను పెంచే సమయం ఇది. ఇంటి నుండి పనిని ప్రోత్సహించండి మరియు వారిని ఫ్రీలాన్సర్లుగా మార్చడానికి ప్రయత్నించండి. మీ ఉద్యోగులు తమ కోసం తాము సంపాదించుకోనీయండి. ఈ సమయంలో, జీతం ఆలస్యంతో పనితీరును మీరు ఖచ్చితంగా వదులుకోవద్దు. కాబట్టి, మీ సమీప భవిష్యత్తు కోసం ముందస్తు ప్రణాళిక వేయండి మరియు మీ ఉద్యోగుల మూడు నెలల జీతం ముందుగానే అందేలా చూడండి.
ఉద్యోగుల ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం ప్రణాళిక
మీ ఉద్యోగులు మీలాగే అభద్రతా భావాలతో మునిగిపోయి ఉంటారు. ప్రతి వ్యక్తికి ఆరోగ్యం మరియు సంరక్షణ కార్యక్రమాలను అందించడం ద్వారా వారిపట్ల మీకున్న సంరక్షణను మీరు వ్యక్తం చేయాలి. ఇది అదనపు పెట్టుబడిగా అనిపించినప్పటికీ, సంతోషంగా ఉన్న ఉద్యోగులు ఎప్పటికీ దానిని దాచుకోరు, దానికి రెండు రెట్లు తిరిగి అందేలా చేస్తారు.
మీ భారాన్ని మీ టీమ్‌తో పంచుకోండి
మీరు మీ టీమ్‌ను మీ కుటుంబంగా భావిస్తే, వారు మీ శ్రేయస్సులో భాగంగా ఉన్నట్లే మీ నిరాశలో కూడా వారు మీతో ఉండాలి. కంపెనీ ఏ పరిస్థితిలో ఉన్నదో వారికి వివరించి చెప్పండి మరియు మీ వ్యాపారం గురించి మీ ఉద్యోగులు మీలాగే భావిస్తున్నారని నిర్ధారించుకోండి.
మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని చూసుకోండి
నిరంతర ఒత్తిడి మీ వివేకతను కప్పి ఉంచుతుంది, మీ నమ్మకాలు నిజం కాకపోవచ్చు. ప్రతిరోజూ ఒక గంట పాటు నడక కొనసాగించండి మరియు మీతో పాటు మీ సెల్ ఫోన్‌ను తీసుకెళ్లకుండా ప్రయత్నించండి. మీ మనస్సు ఏకాంతంలో గడపడానికి అనుమతించండి, ఏమి జరుగుతుందో విశ్లేషించండి మరియు పరిష్కారాలను అన్వేషించండి. పుస్తకాలు చదవడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకోండి. నిరంతర నిందారోపణలతో మనశ్శాంతి ఉండదు కాబట్టి దానిని ఆపివేయండి.
మీ వ్యాపారం కోసం మీ పర్సనల్ ఫైనాన్స్ కోల్పోకుండా ప్రయత్నించండి
హద్దులు అనేవి చాలా ముఖ్యమైనవి. అది మీ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితాన్ని పడనీయకుండా మిమ్మల్ని కాపాడుతుంది. పరిమిత నిధులతో, మీరు మీ వ్యాపారాన్ని నిలుపుకోవడానికి మీ ప్రతి చివరి పైసాను పెట్టుబడి పెట్టడానికి ప్రలోభాలకు లోనవుతారు, కానీ ఇప్పుడే మీ వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించగలిగితే మీ వ్యాపారాన్ని పునర్నిర్మించుకోవచ్చని మీరు గుర్తుంచుకోండి.
ఈ కఠినమైన సమయాలలో వ్యాపారాన్ని నడపడం మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ, ఈ చీకటి కంటే ముందు కాంతి గురించి ఆలోచించండి. వ్యాపార సవాళ్లు మిమ్మల్ని బలంగా ఉండేలా చేస్తాయి, అవి అద్భుతమైన ఆలోచనలను స్వీకరించేలా మరియు కనుగొనేలా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి, దేనికి భయపడవద్దు, దానితో వ్యవహరించండి మరియు మనం ఇంకొక వైపు అభివృద్ది చెందడంతో పాటు శక్తివంతులం అవుతాం.
మహమ్మద్ ముకర్రం,
బిజినెస్ హెడ్, జెన్ మీడియా.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!