వర్షానికి సంబంధించిన ఆ వీడియోలను షేర్ చేస్తే కఠిన చర్యలు: సీపీ మహేష్ భగవత్
- July 16, 2021
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్ర రాజధాని హదరాబాద్లోనూ గత కొన్ని రోజులుగా విస్తారంటా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ సమయంలోనే కొంత మంది గతేడాది హైదారాబాద్ వరదలకు సంబంధించిన వీడియోలను కొత్తవిగా షేర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై రాచకొండ సీపీ మహేస్ భగవత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. భారీ వర్షాలకు నగరంలో వరదులు వచ్చాయి, ఇళ్లు కూలిపోతున్నాయి అని పాత వీడియోలను వైరల్ చేస్తోన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొందరు ఉద్దేశపూర్వకంగా గతేడాది వరదల వీడియోలను కొత్తవిగా ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. వర్షాల కారణంగా ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే 100కు ఫోన్ చేస్తే సంబంధిత సిబ్బంది సహకారం అందిస్తారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బందికి ప్రజలు సహకరించాలి’ అని సీపీ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే నగరంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!







