ఇంధన ద్వైపాక్షిక భాగస్వామ్యాంపై సౌదీ, భారత్ మంత్రుల ఫోన్ కాల్

- July 17, 2021 , by Maagulf
ఇంధన ద్వైపాక్షిక భాగస్వామ్యాంపై సౌదీ, భారత్ మంత్రుల ఫోన్ కాల్

సౌదీ: సౌదీ, భారత్ మధ్య ఇంధన ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలపడాలని తాము అభిలాషించినట్లు భారత కేంద్రమంత్రి హర్ధిక్ సింగ్ పూరీ వెల్లడించారు.
భారత పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న హర్దిక్ సింగ్ పూరీకి సౌదీ ఎనర్జీ మినిస్టర్, ప్రిన్స్ అబ్ధులాజీజ్ బిన్ సల్మాన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా చమురు ధరలు, అంతర్జాతీయంగా చమురు రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భారత చమురు అవససరాలపై సౌదీ మంత్రితో ప్రస్తావించినట్లు హర్ధిక సింగ్ పూరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాబోయే కాలంలో భారత చమురు అవసరాలను తీర్చటంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించాలని కోరినట్లు తెలిపారు. అదే సమయంలో అమ్మకందారు-కొనుగోలుదారు పరిధిలో ఇరు దేశాల మధ్య చమురు ద్వైపాక్షిక భాగస్వామ్యం పటిష్టం అవ్వాలని, రెండు వైపుల నుంచి పెట్టుబడి అవకాశాలను సరళమైన విధానాలను అవలంభించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కొద్దికాలంగా చమురు ధరల్లో చోటు చేసుకుంటున్న అసాధారణ పెరుగుదల నియంత్రణకు కృషి చేయాలని, అందుకు సౌదీ సహకరించాలని కోరారు. అలాగే చమురు ధరల తగ్గింపు కోసం అబుధాబి నేషనల్ ఆయిల్ కార్పోరేషన్ -ADNOC, యూఏఈ మద్దతు తీసుకోవాలని ADNOC చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కు పిలుపునిచ్చారు మంత్రి హర్ధిక్ సింగ్ పూరీ.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com