ఏపీ కరోనా అప్డేట్
- July 20, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 88,149 శాంపిల్స్ పరీక్షించగా.. 2,498 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.మరో 24 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు… తాజా మృతుల్లో చిత్తూరులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరులో ఇద్దరు చొప్పున, కృ ష్ణ, కర్నూలు, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇక, గత 24 గంటల్లో 2,201 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 2,37,52,356కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసులతో కలుపుకుని.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,44,222కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 19,07,201కు పెరిగింది. ఇప్పటి వరకు 13,178 మంది కరోనా బాధితులు కన్నుమూస్తే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 23,843 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







