‘హీరో’ డబ్బింగ్ పూర్తిచేసిన జగపతి బాబు
- July 21, 2021హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ప్రిన్స్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘హీరో’. అమరరాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అశోక్ తల్లి పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ‘హీరో’ మూవీకి తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఇప్పటికే సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న జగపతిబాబు డబ్బింగ్ సైతం కంప్లీట్ చేశారు.
ఆ విషయాన్ని జగ్గూబాయ్ డబ్బింగ్ థియేటర్ లో ఉన్న ఫోటోను జత చేస్తూ, తెలియచేసింది చిత్ర బృందం. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘హీరో’ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రెస్పాన్స్ వస్తోంది. అశోక్ గల్లా తన తొలి చిత్రంలోనే కృష్ణ నటించిన ‘యమలీల’ మూవీలోని ‘జుంబారే జూజుంబరే’ సాంగ్ ను రీమిక్స్ చేసి, తనదైన స్టైల్ లో నర్తించడం విశేషం.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..