ఫుడ్ డెలివరీ మోటారు సైకిల్స్‌ తీరు పట్ల ఆందోళన

- July 21, 2021 , by Maagulf
ఫుడ్ డెలివరీ మోటారు సైకిల్స్‌ తీరు పట్ల ఆందోళన

మనామా: ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్ మరియు నేషనల్ సెక్యూరిటీ కమిటీ, ఫుడ్ డెలివరీ మోటారు సైకిల్స్ తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వాహనాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ట్రాఫిక్ అలాగే ఆరోగ్యం ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని, ఓ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఫుడ్ డెలివరీ నిమిత్తం మోటారు సైకిళ్లపై డెలివరీ చేసే వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. తమ వాహనాల వెనుక ఏర్పాటు చేసుకుంటున్న ఫుడ్ క్యారీయింగ్ బాక్సుల పట్ల కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతరులకు ప్రమాదకరంగా మారేలా ఈ వాహనాలు రోడ్లపై తిరుగుతున్న దర్మిలా ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com