వినియోగదారుల్ని ఆకర్షించేందుకు పిసిఆర్ టెస్ట్ ధరల్ని తగ్గించిన ప్రైవేట్ క్లినిక్స్

- July 22, 2021 , by Maagulf
వినియోగదారుల్ని ఆకర్షించేందుకు పిసిఆర్ టెస్ట్ ధరల్ని తగ్గించిన ప్రైవేట్ క్లినిక్స్

ఖతార్: ప్రయాణ సన్నాహాల్లో ఉన్న నివాసితులు మరియు పౌరుల కోసం కోవిడ్ 19 పీసీఆర్ టెస్టు ధరల్ని ప్రయివేటు క్లినిక్స్ తగ్గించాయి. గతంలో ఈ ధర 300 ఖతారీ రియాల్స్ ధర ఉండగా, ఇప్పుడది 33 శాతం తగ్గి, 200 ఖతారీ రియాల్స్‌కే అందనుంది. సమ్మర్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లేందుకు చాలా మంది సన్నద్ధమవుతుండగా, పీసీఆర్ టెస్టు ఆ ప్రయాణాలకు తప్పనిసరి కావడంతో, ప్రయివేట్ క్లినిక్స్ వద్ద రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రయివేట్ క్లినిక్స్ మధ్య పోటీ నేపథ్యంలో వినియోగదారుల్ని ఆకర్షించడానికి ఈ ధరల్ని తగ్గించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com