ఏపీలో కరోనా కేసుల వివరాలు
- July 22, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1843 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,48,592కి చేరింది.ఇందులో 19,11,812 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 23,571 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 12 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,209 మంది మృతి చెందారు.రాష్ట్రంలో 24 గంటల్లో 70,727 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.ఇప్పటి వరకు మొత్తం 2,39,09,363 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది.రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో 301, పశ్చిమ గోదావరిలో 235, ప్రకాశం జిల్లాలో 232, తూర్పు గోదావరిలో 222, నెల్లూరులో 203 కేసులు నమోదయ్యాయి. రోజువారి కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా తీవ్రత తగ్గలేదని, జాగ్రత్తగాఉండాలని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







