హజ్ మీల్స్ లో ఉల్లంఘనలపై ఫైన్

- July 23, 2021 , by Maagulf
హజ్ మీల్స్ లో ఉల్లంఘనలపై ఫైన్

సౌదీ: హజ్ యాత్రికులకు వడ్డించే భోజనంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై సౌదీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.మీల్స్ ప్రిపరేషన్ లోగానీ, వడ్డించే విషయంలోగానీ ముందస్తుగా చేసుకున్న ఒప్పందాల మేరకు క్యాటరింగ్ ప్రవైడర్లు నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొన్ని హజ్ సేవా సంస్థలు తక్కువ-నాణ్యత గల క్యాటరింగ్ ప్రొవైడర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాయని, కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్లను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.భోజనం వడ్డించే సమయంలో మాస్కులు కూడా ధరించటం లేదని సీరియస్ అయ్యింది.భోజనం విషయంలో నిబంధనల ఉల్లంఘనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత ఉల్లంఘునులపై జరిమానాలు విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com