యూఏఈ లో ప్రతిభ కనపరుస్తున్న చిన్నారులు

- July 28, 2021 , by Maagulf
యూఏఈ లో ప్రతిభ కనపరుస్తున్న చిన్నారులు

షార్జా: యూఏఈ లో షార్జాకు చెందిన చి.అనీష్ నాగసాయి శ్రీపతి పండితారాధ్యుల,రూబిక్స్ క్యూబ్స్ పరిష్కరించడం లో సరికొత్త రికార్డులను సాధిoచారు.మాక్సిమమ్ నంబర్ ఆఫ్ రుబిక్ క్యూబ్స్ సాల్వ్డ్ వైల్ స్పిన్నింగ్ ఆన్ స్మార్ట్ వీల్ ” పై నాలుగు ప్రపంచ రికార్డులు సాధించారు.వీరు కిరణ్ కుమార్ ఎస్.పి. మరియు రాగ మయూరి ఎస్.పి.కుమారుడు, షార్జాలో అవర్ ఓన్ ఇంగ్లీష్ హై స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నారు.

స్మార్ట్‌ వీల్ పై స్పిన్నింగ్ & బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు 21 ప్రత్యేకమైన క్యూబ్స్‌ 2x2, 3x3, 4x4, ట్విస్ట్ క్యూబ్,సిలిండర్ క్యూబ్, ఐవీ క్యూబ్, scewb, స్క్వేర్ -1,విండ్‌మిల్ క్యూబ్,ఫిషర్ క్యూబ్, గేర్ క్యూబ్, రెయిన్బో బాల్ క్యూబ్, పిరమిక్స్ మొదలగు క్యూబ్స్ ను పరిష్కరించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్,ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్వా, ఆసియ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచే ప్రత్యేక అవార్డులను పొంది,వారి బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించారు. 

అలగే వీరి కుమార్తె అయిన చి.హాసిని లక్ష్మి శ్రీపతి పండితారాధ్యుల కి "సూపర్ టాలెంటెడ్ కిడ్" అనే అవార్డును ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచే అందుకున్నారు.వీరు షార్జాలో అవర్ ఓన్ ఇంగ్లీష్ హై స్కూల్ లో 6వ తరగతి చదువుతున్నారు.వీరు కర్ణాటక సంగీతం వారి తల్లి అయిన రాగ మయూరి వద్ద అభ్యసిస్తూ ఎన్నో బహుమతులు మరియు కచేరీలు చేస్తున్నారు.
 
వీరిద్దరికి మా గల్ఫ్ నుంచి ప్రత్యేక అభినందనలు తెరియజేస్తూ మరెన్నో ప్రపంచ రికార్డులు సాధించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుంటున్నాము.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com