ఆగస్ట్ నుంచి ఖతార్-భారత్ మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు
- July 29, 2021
దోహా: వందేభారత్ మిషన్ లో భాగంగా ఆగస్ట్ నుంచి ఖతార్-భారత్ మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 29 వరకు నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.దీంతో ముంబై, హైదరాబాద్, కొచ్చి నుంచి అదనంగా వారానికి రెండు విమానాలు నడపనున్నారు.అలాగే దోహా నుంచి కూడా వారానికి రెండు విమానాలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. అయితే..కోవిడ్ నేపథ్యంలో ఖతార్ ఎంట్రీకి అర్హతలను ప్రయాణికులు ముందే చెక్ చేసుకోవాలని ఎయిరిండియా సూచించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఖతార్ విధించిన నిబంధనలు, సూచనలు, అవసరమైన డాక్యుమెంట్లను సరిచూసుకున్న తర్వాత అన్ని అర్హతలు ఉన్న వారే ప్రయాణానికి సిద్ధం కావాలని తెలిపింది. ఒకవేళ ఏదైనా కారణాలతో ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరిస్తే అందుకు తాము బాధ్యత వహించబోమని కూడా ఎయిరిండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









