ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ భేటీ..

- July 30, 2021 , by Maagulf
ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ భేటీ..

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆగస్టు ఒకటిన మంత్రివర్గ సమావేశం కానుంది.ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, జులైలో రెండు సార్లు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది.జూలై 6న మంత్రి వర్గం సమావేశం కాగా..జూలై 13న కొనసాగిన సమావేశం ఏకంగా రెండు రోజుల పాటు కొనసాగింది. ఈ సమావేశాల్లో రైతుబంధుతోపాటు వ్యవసాయ సంబంధమైన నిర్ణయాలు తీసుకున్నారు.అయితే.. మరో ఆగస్టు 1న మరోసారి కేబినెట్ సమావేశం కానుంది. అయితే, ఈ సమావేశంలో దళిత బంధు అమలుతోపాటు ఇతర వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి గత కేబినెట్‌లోనే నిర్ణయం తీసుకున్నా…దాని అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఎమ్మెల్యేకు నిరసన వ్యక్తమవుతోంది. ఆయా నియోజకవర్గాల్లో కూడా అమలు చేయాలని డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలోనే ఆదివారం జరగబోయే సమావేశంలో మరోసారి ఈ పథకంపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి మహాయజ్ఞం ఆగబోదని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆరు నూరైనా దళితబంధు అమలు చేసి తీరతామన్నారు. రైతు బీమా తరహాలోనే చేనేతలకు, దళితులకు బీమాను అందిస్తామన్నారు. పథకాల అమలులో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.ఈ క్రమంలోనే కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక ఇప్పటికే చేనేతలకు బీమాపై సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలోనే దానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది.త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్యే కోటా ఆరుగురు ఎమ్మెల్సీల ఎంపిక జరుగనున్న నేపథ్యంలో మరిన్ని కీలక అంశాలపై రాష్ట్ర మంత్రి మండలి చర్చించే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com