గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్లకు ఆన్ లైన్లోనే దరఖాస్తులు

- August 01, 2021 , by Maagulf
గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్లకు ఆన్ లైన్లోనే దరఖాస్తులు

ఖతార్: 2021-22 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకు పేరెంట్స్ ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని ఖతార్ విద్యాశాఖ వెల్లడించింది. ఆగస్ట్ 1(నేటి నుంచి) ఆగస్ట్ 15లోగా http://eduservices.edu.gov.qa వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రవాసీయులు కూడా ప్రభుత్వ స్కూళ్లల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సహాయం కోసం అభ్యర్థనలు స్వీకరించబడతాయని, ఇందుకోసం రేపటి (ఆదివారం) నుంచి వెస్ట్ బేలోని మినిస్ట్రీ టవర్‌లోని జాస్సిమ్ బిన్ హమద్ హాల్‌ను విద్యార్ధుల తల్లిదండ్రులు సందర్శించవచ్చు. ఖతార్ విద్యార్థులు, జీసీసీ దేశాల వారు, ప్రభుత్వ రంగంలో పనిచేసే ప్రవాసీయుడు-ఖతార్ మహిళ పిల్లలు స్కూల్ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్ధుల అర్హతను స్టూడెంట్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అంచనా వేసిన తర్వాత దరఖాస్తులను స్కూల్ అధికారులు ఆమోదిస్తారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై సందేహాలు, అనుమానాలు ఉంటే పబ్లిక్ సర్వీసెస్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న యూజర్ గైడ్ లో చెక్ చేసుకోవచ్చు లేదా  155 హాట్‌లైన్‌ ద్వారా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com