రమదాన్ సందర్భంగా ట్రాఫిక్‌ స్పెషల్‌ డ్రైవ్‌

- June 04, 2015 , by Maagulf
రమదాన్ సందర్భంగా ట్రాఫిక్‌ స్పెషల్‌ డ్రైవ్‌

రమదాన్  సందర్భంగా రహదార్లపై ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా ఉండేందుకు అబుదాబీ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో రోడ్లపై ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది గనుక వాహనాల్లో ప్రయాణించేవారు నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాల్ని నడిపాలని పోలీసులు సూచించారు. వాహనదారులే కాకుండా, రోడ్లపై నడిచేవారు కూడా ట్రాఫిక్‌ నిబంధనల్ని పాటించాల్సి ఉందని చీఫ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సెక్షన్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ మహమ్మద్‌ అల్‌ షెహ్హీ చెప్పారు. ఎక్కడబడితే అక్కడ వాహనాల్ని పార్కింగ్‌ చేయడం ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనే అవుతుందన్నారు. మసీదుల్లో ప్రార్థనా సమయాల్లో పక్కనే ఉండే రోడ్లపై ట్రాఫిక్‌ నిలిచిపోకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు ట్రాఫిక్‌ విభాగం తీసుకుంటుందన్నారు అల్‌ షహ్హీ. పరిమిత వేగంతో వాహనాలు నడపడం మంచిదని సూచిస్తూ, సిగ్నలింగ్‌ లైట్స్‌ సరిగ్గా వినియోగించాలని వాహనదారుల్ని కోరింది ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com