అల్ ఖోర్ నాసిరకం వంటకాలు..స్వాధీనం చేసుకున్న అధికారులు
- August 02, 2021
ఖతార్: అపరిశుభ్ర పరిసరాలు..నాసిరకం పదార్ధాలకు సిద్ధం చేస్తున్న వంటకాలను సీజ్ చేసినట్లు అల్ ఖోర్, అల్ తఖిరా మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. ప్రజలకు విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న వంటకాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదని ఆరోపించింది. అల్ ఖోర్ ప్రాంతంలోని కార్మిక వసతి భవనాల్లో భవనాల్లో కొంత మంది ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నట్లు ఆరోగ్య నియంత్రణ విభాగానికి సమాచారం అందింది అని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే, హెల్త్ కంట్రోల్ ఇన్స్పెక్టర్లు, వర్కర్స్ హౌసింగ్ ఇన్స్పెక్టర్ల బృందం తనిఖీ కోసం ఘటనా స్థలానికి వెళ్లి నివాసం లోపల అపరిశుభ్రతతో తయారు చేసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దీనిపై రిపోర్ట్ సిద్ధం చేసి, మానవ ఆహార చట్టం నిబంధనలకు అనుగుణంగా నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం
- మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి
- సాయి సన్నిధిలో ఘనంగా 11వ ప్రపంచ సదస్సు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము







