నివాసిత వైద్యులందరికీ గోల్డెన్ వీసా
- August 02, 2021
యూఏఈ: వ్యాపారవేత్తలు, అత్యన్నత ప్రతిభ ఉన్న విద్యార్థులు,ఇంజినీర్లు, వైద్య నిపుణులకు యూఏఈ గోల్డెన్ వీసాను జారీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే యూఏఈ..తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.యూఏఈలో నివసిస్తున్న వైద్యులకు, వారి కుటుంబ సభ్యులకు గోల్డెన్ వీసాలు ఇచ్చేందుకు రెడీ అయింది.ఇందులో భాగంగా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ICA)..యూఏలో నివసిస్తున్న వైద్యులకు గోల్డెన్ వీసాలను జారీ చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి గోల్డెన్ రెసిడెన్సీ సేవలను ప్రారంభించింది.ఈ సందర్భంగా ICA డెరెక్టర్ జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ మాట్లాడారు.కోవిడ్ విజృంభణ నేపథ్యంలో వైద్యులు అందిస్తున్నసేవలకు విలువకట్టలేమని అభిప్రాయపడ్డారు.గోల్డెన్ వీసాలు జారీ చేయడం ద్వారా వైద్యులను యూఏఈ గౌరవిస్తోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం
- మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి
- సాయి సన్నిధిలో ఘనంగా 11వ ప్రపంచ సదస్సు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము







