దోఫర్, మసీరా గవర్నరేట్లలో ఆంక్షల్లేవ్..ఒమన్ క్లారిటీ

- August 03, 2021 , by Maagulf
దోఫర్, మసీరా గవర్నరేట్లలో ఆంక్షల్లేవ్..ఒమన్ క్లారిటీ

మస్కట్: దోఫర్, మసీర గవర్నరేట్లలో రాకపోకలను నిషేధిస్తూ ఆంక్షలను అమలు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఒమన్ కొట్టిపారేసింది. కోవిడ్ -19 ని నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు, ధోఫర్, మసీరా గవర్నరేట్‌లు మూసివేయబడ్డాయని ఓ ఇమేజ్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దోఫర్, మసీరా గవర్నరేట్లలో ఎలాంటి ఆంక్షలు విధించలేదని ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఇమేజ్ మెసేజ్ 2020 నాటిదని స్పష్టత ఇచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com