యూఏఈ వచ్చే ప్రయాణీకులకు మార్గదర్శకాలు విడుదల

- August 04, 2021 , by Maagulf
యూఏఈ వచ్చే ప్రయాణీకులకు మార్గదర్శకాలు విడుదల
యూఏఈ: ఇండియా తో వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసీయులు ఎప్పుడెప్పుడు యూఏఈ తమను అనుమతిస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వీరికి గుడ్ న్యూస్ చెప్పింది యూఏఈ యంత్రాంగం. ఆగస్టు 5 నుండి UAE లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని అధికారులు మంగళవారం ప్రకటించారు. అయితే, చెల్లుబాటు అయ్యే UAE రెసిడెన్సీ వీసాలు ఉండి, యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులను పూర్తిచేసుకున్న నివాసితులు మాత్రమే యూఏఈ వచ్చేందుకు అర్హులు అని జాతీయ అత్యవసర సంక్షోభం మరియు విపత్తుల నిర్వహణ సంస్థ (NCEMA) తెలిపింది.  
 
ప్రయాణానికి ముందు వ్యాక్సిన్ రెండవ డోసు పూర్తై కనీసం 14 రోజులు అయ్యి ఉండాలి అని అధికార యంత్రాంగం తెలిపింది. అలాగే, ప్రయాణికులు తమ వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
 
యూఏఈ లో ఆమోదించబడిన వ్యాక్సిన్లు ఇవి:
1. ఫైజర్
2. ఆస్ట్రాజెనెకా లేదా కోవిషీల్డ్
3. సినోఫార్మ్
4. స్పుత్నిక్
5. మోడెర్నా
6. జాన్సన్ & జాన్సన్ 
7. సినోవాక్ (కరోనావాక్)
8. నోవావాక్స్
 
వీరికి మాత్రం మినహాయింపు:
వ్యాక్సిన్లు తీసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా యూఏఈ లో పనిచేసే వైద్యులు, నర్సులు మరియు సాంకేతిక నిపుణులు ఈ ప్రయాణ నిషేధం నుండి మినహాయించబడ్డారు. అలాగే విద్యా రంగంలో పనిచేస్తున్న నివాసితులు, విద్యార్థులు, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే కార్మికులు కూడా అనుమతించబడ్డారు. యూఏఈ లో చికిత్స పూర్తి చేయాల్సిన వారు కూడా మినహాయించబడిన వర్గంలో ఉన్నారు.
మినహాయించబడిన అన్ని వర్గాలు అవసరమైన అనుమతులు పొందేందుకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ సిటిజన్‌షిప్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సమర్థులైన అధికారులు ఆమోదించిన వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లను వారు అప్లికేషన్‌తో పాటు జతపరచాలి.
 
ICA దరఖాస్తు విధానం:
దేశానికి తిరిగి వచ్చే యూఏఈ నివాసితులు తమ విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు షరతులను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని ట్రావెల్ ఏజెంట్లు సూచించారు. మొదటగా నెగటివ్ పిసిఆర్ పరీక్ష రిపోర్ట్ పొందడం, తర్వాత 'ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్' (ICA) వెబ్‌సైట్ (https://uaeentry.ica.gov.ae) లో ప్రయాణానికి సంబంధించి అనుమతి ను తనిఖీ చేయడం ముఖ్యం. యూఏఈ వచ్చే ప్రయాణీకుల కోసం 'ప్రీ-ట్రావెల్ అప్రూవల్' (ప్రయాణానికి ఆమోదం తెలిపే) సిస్టమ్‌ను అప్‌డేట్ చేసింది ICA. ఆమోదం తెలిపే దశలో కఠినమైన పరిశీలన ప్రక్రియను ఏర్పాటు చేసింది ICA.
 
ఈ అప్‌డేట్ చేయబడిన ICA అప్రూవల్ వెబ్‌పేజీ (https://smartservices.ica.gov.ae/echannels/web/client/guest/index.html#/registerArrivals) లో ప్రయాణికులు తమ పాస్‌పోర్ట్ వివరాలు, వ్యాక్సిన్ సమాచారం, PCR పరీక్ష ఫలితాలను ప్రయాణానికి ముందు అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది.
 
ప్రయాణ అనుమతికి అవసరమైన పత్రాలు, అప్-లోడ్ చేసే విధానం:
1. దరఖాస్తుదారు సమాచారాన్ని పూరించండి.
* దరఖాస్తుదారు సమాచారంలో పేరు, లింగం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, తిరిగి వచ్చే తేదీ (తమ దేశానికి తిరిగి వెళ్లే వారికి వర్తిస్తుంది), ప్రయాణించే దేశం పేరు, ప్రయాణానికి బయలుదేరే దేశం పేరు, ఇ-మెయిల్ వంటి వివరాలు ఉంటాయి.
* మీ ఇ-మెయిల్‌కు ఒక QR కోడ్ పంపబడుతుంది. దయచేసి నమోదు చేసిన ఇమెయిల్ సరైనదని నిర్ధారించుకోండి.
 
2: పాస్‌పోర్ట్ సమాచారాన్ని పూరించండి.
* దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్ రకం, గడువు తేదీ, ఇష్యూ తేదీ, నంబర్ మరియు ఇష్యూ దేశం వివరాలు నింపాలి.
 
3: యూఏఈ లోని చిరునామాను పూరించండి.
* మొబైల్ నంబర్‌తో పాటు UAE లో స్థానిక చిరునామాను అందించండి.
 
4: వ్యాక్సిన్ మరియు PCR పరీక్ష తేదీలను పూరించండి.
* నివాసితులు ఈ రూపంలో ఎంచుకోగల ఎనిమిది వ్యాక్సిన్ ల జాబితాను ICA అందించింది, అవి: స్పుత్నిక్-వి, జాన్సెన్ & జాన్సన్, మోడెర్నా, నోవావాక్స్, ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌, సినోఫార్మ్, సినోవాక్.
* దరఖాస్తుదారులు తమ మొదటి, రెండవ మరియు మూడవ మోతాదులను (వర్తించే చోట) అందుకున్న తేదీలను పూరించాలి. PCR పరీక్ష తేదీ మరియు పరీక్ష ఫలితాల తేదీలను కూడా తప్పనిసరిగా పేర్కొనాలి.
 
5: పత్రాలను అప్‌లోడ్ చేయండి.
* పాస్‌పోర్ట్ కాపీ, మీ ఫోటో మరియు పిసిఆర్ పరీక్ష ఫలితాలు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. 
 
6: ప్రకటనలు
* యూఏఈ ఆరోగ్య అధికారుల చట్టాలను పూర్తిగా పాటించాలని పేర్కొన్న వెబ్‌సైట్ డిక్లరేషన్ బటన్‌పై క్లిక్ చేయండి మరియు జతచేయబడిన అన్ని పత్రాలు సరైనవని నిర్ధారించండి.
 
7: 'సబ్మిట్' బట్టన్ నొక్కండి.
 
ట్రావెల్ ఏజెంట్లు ఇస్తున్న సూచనలు:
* దుబాయ్ మినహా అన్ని ఎమిరేట్‌లకు ప్రయాణించే ప్రయాణీకులు తప్పనిసరిగా http://uaeentry.ica.gov.ae లో తమ పత్రాల చెల్లుబాటును తనిఖీ చేయాలి. తప్పనిసరిగా వారి ఎమిరేట్స్ ID నంబర్, పాస్‌పోర్ట్ నంబర్, జాతీయతను నమోదు చేయాలి. మీ పత్రాలు చెల్లుబాటు అయినట్లయితే ICA నుండి 'గ్రీన్' స్టేటస్/మెసేజ్ లభిస్తుంది. ఒకవేళ 'రెడ్' ICA స్టేటస్/మెసేజ్ వచ్చినట్లైతే, మీరు మీ ప్రయాణాన్ని కనీసం 30 నుండి 60 రోజుల వరకు (లేదా ICA లో సూచించిన విధంగా తగినన్ని రోజులు) వాయిదా వేసుకోవాలి అని అధికారులు తెలిపారు. దుబాయ్ నివాసితులు మాత్రం 'జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్' (GDRFA) నుండి ప్రయాణానికి ముందు ఆమోదం పొందాలి.
 
*  మీరు ICA నుండి 'గ్రీన్' స్టేటస్ లేదా GDRFA నుండి ఆమోదం పొందిన తర్వాత, ప్రయాణించదలచిన విమానయాన సంస్థ వారి నియమాలు మరియు నిబంధనలను చూడండి. అలాగే, విమానాశ్రయ నిబంధనలను కూడా చెక్ చేయటం మర్చిపోకండి. 
 
 * మీ స్వదేశంలో ప్రయాణానికి ముందు ఆమోదాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి.
 
* యూఏఈ లేదా స్థానిక అధికారులు ఆమోదించిన కేంద్రాల నుండి కోవిడ్ పరీక్ష చేయించుకోండి.
 
* మీరు కోవిడ్ -19 నెగటివ్ పరీక్ష ఫలితాన్ని అందుకున్న తర్వాత, టిక్కెట్లను బుక్ చేసుకోండి.
 
* ప్రయాణ రోజున, ఆరోగ్య ప్రకటన ఫారమ్‌పై సంతకం చేయండి. అలాగే UAE యొక్క హెల్త్ యాప్ AlHosn ని డౌన్‌లోడ్ చేయండి. దుబాయ్ నివాసితులు తప్పనిసరిగా DXB స్మార్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
 
* ప్రయాణానికి PPE కిట్‌లు, హ్యాండ్ శానిటైజర్‌లు మరియు ఇతర రక్షణ పరికరాలను తీసుకెళ్లండి. విమానాశ్రయానికి త్వరగా చేరుకోండి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com