కమలహాసన్‌ను జీవిత సాఫల్య తమిళర్ బిరుదుతో ...
- March 12, 2016
ఇప్పటికే పద్మశ్రీ వంటి జాతీయ అవార్డుతో పాటు పలు విశిష్ట అవార్డులు ఆయన్ని వరించాయి. తాజాగా జీవిత సాఫల్య తమిళర్ అవార్డు పురస్కారం కమలహసన్ కోసం ఎదురు చూస్తోంది. ఆరేళ్లుగా నార్వే చిత్రోత్సవాలు నిర్వహిస్తూ తమిళ కళాకారులతో పాటు, తమిళేతర చిత్ర కళాకారులకు తమిళర్ విరుదు పేరుతో అవార్డులను అందిస్తున్నారు. ఏడో నార్వే తమిళ చిత్రోత్సవ కార్యక్రమం మార్చి 28 నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకూ నార్వేలో నిర్వహించనున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పోటీకి నామినేషన్ల గడువు ఈ నెల 15తో ముగియనుందని నిర్వాహకులు వెల్లడించారు.ఈ నెల 25న అవార్డులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రోత్సవాల్లో తమిళనాడులో నిర్మించిన చిత్రాలతో పాటు తమిళేతర దేశాల్లో రూపొందించిన తమిళ చిత్రాలకు అవార్డులను అందించనున్నట్లు వెల్లడించారు. పూర్తి చిత్రాలతో పాటు లఘు చిత్రాలు, డాక్యుమెంట్ చిత్రాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ కేటగిరీల్లో అవార్డు పోటీలు ఉంటాయన్నారు. నార్వే ప్రభుత్వ అంగీకారంతో ఈ చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీన విశ్వనటుడు కమలహాసన్‌ను జీవిత సాఫల్య తమిళర్ బిరుదుతో సత్కరించనున్నట్లు వెల్లడించారు. అలాగే నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కలైశిఖరం అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









