భార్యను కిరాతకంగా చంపిన భర్త అరెస్ట్

- August 09, 2021 , by Maagulf
భార్యను కిరాతకంగా చంపిన భర్త అరెస్ట్

తైఫ్: క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వింగ్ - పోలీసు శాఖ, ఓ యువ సౌదీ పౌరుడ్ని అరెస్ట్ చేసింది. నిందితుడికి ఇటీవల పెళ్ళి కాగా, భార్యను అతి కిరాతకంగా రాయితో కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. పెళ్ళయిన వారం రోజులకే ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు అధికారులు. కారులో తన భార్యతో వెళుతూ, నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అటువైపుగా వెళుతున్న కొందరు సమాచారం అందించడంతో సెక్యూరిటీ సిబ్బంది, రెడ్ క్రిసెంట్ అథారిటీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ బాధితురాలు రక్తపు మడుగులో కనిపించారు. ఆ వెంటనే, విచారణ ప్రారంభించి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com