ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ టిక్కెట్ల అమ్మకాల జోరు
- March 12, 2016
2016 ఫార్ములా 1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్‌కి ఇంకొన్ని రోజులే ఉండడంతో టిక్కెట్ల అమ్మకాలు జోరందుకున్నాయి. రేస్ ఫ్యాన్స్‌ని అలరించేందుకు ఏప్రిల్ 1 నుంచి 3 వరకు మూడు రోజులపాటు శిఖర్‌లోని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి టిక్కెట్లు ఎక్కువగా, చాలా వేగంగా అమ్ముడవుతున్నాయని నిర్మాతలు పేర్కొన్నారు. మెయిన్ గ్రాండ్ స్టాండ్ టిక్కెట్ ఖరీదు 150 బహ్రెయినీ దినార్స్‌గా ఉంది. బటెల్కో గ్రాండ్ స్టాండ్ టిక్కెట్ ధర 120 బహ్రెయినీ దినార్స్. టర్న్ వన్ గ్రాండ్ స్టాండ్ టిక్కెట్ 100 దినార్స్ కాగా, యూనివర్సిటీ మరియు విక్టరీ గ్రాండ్ స్టాండ్స్ టిక్కెట్ల ధర 60 బహ్రెయినీ దినార్స్. 3 నుంచి 12 ఏళ్ళ వయసున్న చిన్న పిల్లలకు సగం ధరకే టిక్కెట్లను విక్రయిస్తారు. 3 ఏళ్ళకంటే చిన్నారులకు ప్రవేశం ఉచితం. 13 నుంచి 17 ఏళ్ళ స్కూలు విద్యార్థులకు 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి 10 శాతం, సీనియర్ సిటిజన్స్ మరియు స్పెషల్ నీడ్స్ పీపుల్‌కి 25 శాతం డిస్కౌంట్ టిక్కెట్ ధరల్లో లభిస్తుంది.
తాజా వార్తలు
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









