తెలంగాణ కరోనా అప్‌డేట్
- August 16, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి.గత బులెటిన్‌లో 300కు దిగువగా పాజిటివ్ కేసులు నమోదు కాగా..ఇవాళ మళ్లీ నాలుగు వందలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 405 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతి చెందారు.ఇదే సమయంలో 577 మంది కోవిడ్ బాధితులు పూర్థిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,785కి చేరుకోగా.. రికవరీ కేసుల సంఖ్య 6,41,874కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 3,845కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రం వ్యాప్తంగా 7,093 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 84,262 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







